కరీంనగర్: పూర్వ కరీంనగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను మంత్రి గంగుల కమలాకర్ అపహాస్యం చేశారని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. గంటలకొద్దీ పోలింగ్ బూతులోనే మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అధికార పార్టీకి పోలీసులు అండగా ఉన్నారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థులకు బలం ఉంటే ఓట్లు వేసుకోవచ్చని కానీ ఇన్ని ఉల్లంఘనలు దేనికని ఆయన ప్రశ్నించారు.