పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2021-10-18T05:52:42+05:30 IST

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు.

పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు
డ్వాక్రా మహిళలకు చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరిధర్‌, మేయర్‌ కావటి, ఏసురత్నం తదితరులు

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

గుంటూరు, అక్టోబరు 17: పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. కేవీపీ కాలనీలోని కొల్లిశారద మున్సిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో ఆదివారం వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. నగర మేయర్‌ కావటి  మనోహర్‌నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్నా పొరపాటున జాబితాలో లేని సంఘాలు ఏవైనా ఉంటే వెంటనే స్థానిక సచివాలయాల్లో సంప్రదించాలన్నారు. ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌  మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్వాక్రా, రైతు రుణాల మాఫీ పేరుతో మోసం చేసిందన్నారు. అనంతరం సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి, డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, కార్పొరేటర్లు చంద్రగిరి కరుణకుమారి, పద్మావతి, కాండ్రగుంట గురవయ్య, ఆచారి, నాయకులు అంగడి శ్రీనివాసరావు, గౌస్‌ పీరా, గనిక ఝాన్సీ, జీఎంసీ అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నారు.


Updated Date - 2021-10-18T05:52:42+05:30 IST