ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2022-05-23T06:26:42+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును తక్షణం అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఆదివారం అమలాపురం నల్లవంతెన వద్దనున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.

ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలి

అమలాపురం టౌన్‌, మే 22: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును తక్షణం అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఆదివారం అమలాపురం నల్లవంతెన వద్దనున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలో మండలశాఖల అధ్య క్షులు దెందుకూరి సత్తిబాబురాజు, అరిగెల నానాజీ, నాయ కులు బత్తుల సాయి, కర్రి దత్తుడు, మంద గద్దయ్య, కుసుమ సూర్యమోహనరావు, పిచ్చిక శ్యామ్‌, గెద్దాడ సత్యవేణి, కాశిన బాబి, వలవల శివరావు తదితరులు పాల్గొన్నారు. అమలా పురం పట్టణ, రూరల్‌ సీఐలు ఆర్‌ఎస్‌కే  బాజీలాల్‌, పి.వీర బాబు సిబ్బందితో అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆనందరావుతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని ఉప్పలగుప్తం, అం బాజీపేట పోలీస్‌స్టేషన్లకు తరలించారు. సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తులపై విడిచిపెట్టారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకు కారకుడైన  ఎమ్మెల్సీని తక్షణం అరెస్టు చేయాలని పోలీస్‌ స్టేషన్ల ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్ర మంలో కొల్లు విష్ణుమూర్తి, పెద్దిరెడ్డి పుల్లయ్యనాయుడు, కొప్పాడి వెంకటరామకృష్ణ, గొలకోటి చిన్నా   ఉన్నారు.  



Updated Date - 2022-05-23T06:26:42+05:30 IST