ఎంపీ కేశవరావును కలిసిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-05-20T05:17:57+05:30 IST

సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న గురువారం అసెంబ్లీ హాల్‌లో పార్లమెంట్‌ పరిశ్రమల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, పార్లమెంట్‌ సభ్యుడు కె.కేశవరావును కలిసి తాజా పరిణామాలను వివరించారు.

ఎంపీ కేశవరావును కలిసిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,మే19(ఆంధ్రజ్యోతి) : సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న గురువారం అసెంబ్లీ హాల్‌లో పార్లమెంట్‌ పరిశ్రమల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, పార్లమెంట్‌ సభ్యుడు కె.కేశవరావును కలిసి తాజా పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా త్వరలోనే పార్లమెంట్‌ పరిశ్రమల స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటానని కేశవరావు హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా టెండర్‌ నిర్వహించడం సరికాదని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సిమెంట్‌ పరిశ్రమ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన సహాయాన్నైనా అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయన్నారు. ఇప్పటికే సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామన్నారు.

Updated Date - 2022-05-20T05:17:57+05:30 IST