క్రీడల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-08-08T05:44:03+05:30 IST

క్రీడల అభివృద్ధికి కృషి

క్రీడల అభివృద్ధికి కృషి
జావెలిన్‌త్రో విసురుతున్న చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి జావెలిన్‌త్రో 

ఛాంపియన్‌షి్‌ప పోటీలు

హనుమకొండ స్పోర్ట్స్‌, ఆగస్టు 7:  క్రీడాకారుల సంక్షేమం, క్రీడా మైదానాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌  అన్నా రు. ఆలిండియా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆదేశాల మేరకు  రాష్ట్ర స్థాయిలో జావెలిన్‌త్రో చాంపియన్‌షి్‌ప పోటీలను హనుమకొండ జేఎన్‌ఎ్‌స వేదికగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్‌విప్‌  దాస్యం వినయ్‌భాస్కర్‌ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం క్రీడాపాలసీ ద్వారా మైదానాలు, క్రీడాకారులకు ప్రోత్సా హకాలు అందిస్తూ ఆదుకుంటున్నారని గర్తు చేశారు. జేఎన్‌ఎ్‌సలోని అథ్లెటిక్స్‌ కోసం వామప్‌ ఏరియా ట్రాక్‌ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా జూడో క్రీడాకారుల కోసం జూడో హాలు నిర్మించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ.. తొలిసారిగా హనుమకొండ జేఎన్‌ఎ్‌స వేదికగా 1వ రాష్ట్రస్థాయి జావెలిన్‌త్రో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అం డర్‌-14, 16, 18, 20, మెన్‌ అండ్‌ ఉమెన్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఒకరోజు పాటుగా ఈ పోటీలను నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొనట్టు తెలిపారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌,  అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ వరదరాజేశ్వర్‌రావు, హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి అశోక్‌కుమార్‌, షైన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ మూగల కుమార్‌ యాదవ్‌, రామప్ప పోలీస్‌ అకాడమీ చైర్మన్‌ ఐలి చంద్రమోహన్‌గౌడ్‌, కోచ్‌లు, టెక్నికల్‌ అఫిషీయల్స్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే

అండర్‌ 14 బాలుర విభాగంలో: నాయిని శ్రీకాంత్‌ ప్రథమ (ఆదిలాబాద్‌), ఎస్‌.మహేశ్‌ ద్వితీయ (ములుగు), వంశీ, తృతీయ (కొమరంభీం జిల్లా) 

అండర్‌ -14 బాలికలు: ఎం.సాక్షి  ప్రథమ (కొమరభీం), కె.హారిక ద్వితీయ (భద్రాద్రి కొత్తగూడెం), పి.తీర్థభాయి  తృతీయ (కొమరంభీం జిల్లా)

అండర్‌-16 బాలుర: డి.రాజ్‌కుమార్‌ ప్రథమ (మంచిర్యాల), బి.సాగర్‌ ద్వితీయ (మహబూబాబాద్‌), ఎం.అంబరీష్‌ తృతీయ (నారాయణపేట) 

అండర్‌- 16 బాలికలు: ఎం.శ్రీహర్షిత ప్రథమ(నిజామాబాద్‌) , పాల్గుణ ద్వితీయ (రంగారెడ్డి), బి.ధనుశ్రీ  తృతీయ (నారాయణపేట)

అండర్‌ -18 బాలుర: వై.రాముడు ప్రథమ (జోగులాంబ), ఇ.ప్రశాంత్‌ ద్వితీయ(వరంగల్‌) , కె.సాయితేజ తృతీయస్థానం(కొమరంభీం జిల్లా) 

అండర్‌ -18 బాలికలు: కె.శోభ, ప్రథమ(కొమరంభీం), కె.సుధారాణి ద్వితీయ (నాగర్‌ కర్నూర్‌), ఎస్‌.కౌసర్‌  తృతీయ(మహబూబ్‌నగర్‌)

అండర్‌ -20 బాలుర: వి.స్వామి ప్రథమ(నల్గొండ) , బి.శ్రావణ్‌కుమార్‌ ద్వితీయ (మెదక్‌), కె.లక్ష్మణ్‌కుమార్‌, తృతీయస్థానం (కరీంనగర్‌) 

అండర్‌- 20 బాలికల విభాగం: కె.అఖిల  ప్రథమ (రంగారెడి)్డ, ఏ.సోంబాయి ద్వితీయ (కొమరంభీం), బి.భూమిక  తృతీయస్థానం(కామారెడ్డి)

మెన్‌ విభాగంలో: సిహెచ్‌.ప్రశాంత్‌ ఖమ్మం ప్రథమ, ఇ.తేజ మెదక్‌ ద్వితీయ, డి.శ్రీకాంత్‌ మంచిర్యాల తృతీయస్థానం.

ఉమెన్‌ విభాగంలో: కె.కళ్యాణి భద్రాద్రి కొత్తగూడెం ప్రథమ, జి.సంజుల మెదక్‌ ద్వితీయ, డి.శాంతి నిజామాబాద్‌ తృతీయస్థానం.





Updated Date - 2022-08-08T05:44:03+05:30 IST