Abn logo
Jun 15 2021 @ 09:14AM

ఏజెన్సీ పరిణామాల్లో తప్పు చేసినవారిని వదలం: ఎమ్మెల్యే బాలరాజు

జంగారెడ్డి గూడెం/పశ్చిమ గోదావరి జిల్లా : ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. ఈ దర్యాప్తులో ఎవరైనా తప్పు చేసినట్లుగా తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని వైసీపీ ప్రభుత్వం వదిలి పెట్టదన్నారు. సోమవారం సాయంత్రం బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానమేనని.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదన్నారు. తమ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకు తావులేకుండా పాలన సాగిస్తున్నారని బాలరాజు పేర్కొన్నారు.