Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

AP news: బుట్టాయిగూడెంలో 38వ రోజు ‘గడప గడపకు మన ప్రభుత్వం’

twitter-iconwatsapp-iconfb-icon
AP news: బుట్టాయిగూడెంలో 38వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం

బుట్టాయిగూడెం (ఏలూరు జిల్లా): జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం కోట నాగవరం సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం 38వ రోజు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (Tellam balaraju) పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రతి ఒక్క ఇంటికి ఉద్దేశించిన ప్రభుత్వ నవరత్న పథకాల గురించి ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి పథకం అర్హులందరికీ జగన్ సర్కారు నేరుగా అందిస్తోందని ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే బాలరాజు వివరించారు.


ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మొడియం రామ తులసి, ఎంపీపీ కారం శాంతి రమణ, వైఎ ఎంపీపీలు కుక్కల వరలక్ష్మి, గుగ్గులోత్ మోహన రావు, స్థానిక సర్పంచ్ తెల్లం వెంకట లక్ష్మీ,  సర్పంచులు తెల్లం జయమ్మ, తాటి సీత, తెల్లం రాముడు, మండల పార్టీ అధ్యక్షులు అల్లూరి రత్నాజీ రావు, ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, స్థానిక నాయకులు తాళ్లూరి ప్రసాద్, కుక్కల గోపాల్ కృష్ణ, తెల్లం దుర్గారావు, కుక్కల రాంబాబు, కుక్కల రాంపండు, సురేష్, యాండ్ర రవి, కుక్కల నాగరాజు, పాల రమేష్, చీమల శ్రీను ఎమ్మార్వో శాంతి, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస వర్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మురళి, పీఆర్ ఏఈ,  ఇతర అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెట్ కమిటీ, ప్రజా ప్రతినిధులు, వార్డు మెంబర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.