‘ఏకలవ్య’ గిరిజన ప్రాంత చిన్నారుల విద్యాదీపం : బాలరాజు

ABN , First Publish Date - 2021-07-25T14:37:14+05:30 IST

అన్ని దానాల్లో కన్నా విద్యా దానం గొప్పదని వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వ్యాఖ్యానించారు.

‘ఏకలవ్య’ గిరిజన ప్రాంత చిన్నారుల విద్యాదీపం : బాలరాజు

ఏలూరు : అన్ని దానాల్లో కన్నా విద్యా దానం గొప్పదని వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఎమ్మేల్యే చేతుల మీదుగా 19.74 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 36 కోట్ల రూపాయిల అంచనాలతో ‘ఏకలవ్య’ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం జరిగింది. తొలివిడతగా బిల్డింగ్‌ల నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు పనులకు బుట్టాయిగూడెం ఐటీఐ కళాశాల పక్కన శంకుస్థాపన చేశారు. ‘ఏకలవ్య’ గిరిజన ప్రాంత చిన్నారుల విద్యాదీపమని బాలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. పాఠశాల కోసం స్ధలం ఇచ్చిన బుద్దుల ఉలయ్యను ఎమ్మేల్యే బాలరాజు, అతిథులు సన్మానించారు. నేటి కాలంలో ఇంతటి విశాలమైన స్ధలాన్ని దానం చేయడం.. అందులోనూ ఒక పాఠశాల కోసం ఇవ్వడం ఉలయ్య గొప్పతనమని ఎమ్మెల్యే, అతిథులు కొనియాడారు.


ఈ స్కూల్ ఒక వరం.. నా పూర్వ జన్మ సుకృతం

బుట్టాయిగూడెం మండలం పరిసర ఏజెన్సీ ప్రాంత మండలాల విద్యార్థులకు ఈ స్కూల్ ఒక వరం వంటిది. గతంలో ఈ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలకు కేంద్ర సిలబస్ చదివించాలంటే దూర ప్రాంతాలకు వెళ్లి ప్రేవేట్ పాఠశాలల్లో చదివించాల్సిన పరిస్థితి.. దానికోసం వేలకు వేలు ఫీజులు కట్టలేక సీబీఎస్ఈ చదువులు మన ఏజెన్సీ విద్యార్థులకు అందని ద్రాక్షలాగా ఉండేవి. కానీ ఈ రోజు గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమై తాత్కాలిక భవనాల్లో నడుస్తున్న ఏకలవ్య మోడల్ స్కూల్ ద్వారా విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్ఈ విద్యను అభ్యసిస్తున్నారు. నేడు ఈ స్కూల్‌కి శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం నా పూర్వ జన్మ సుకృతం. ఈ విద్యాలయం మహోన్నతమైన వెలుగులు విరజిమ్మి ఏజెన్సీ ప్రాంతంలో విద్యా కుసుమాలతో అజ్ఞాన అంధకారాలను పారద్రోలాలి అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. 


ఈ కార్యక్రమంలో ఏంఏసీ చైర్మన్ శ్రీమతి కరాటం సీతాదేవి, బుట్టాయిగూడెం సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ, అల్లూరి రత్నాజీ, అరేటి సత్యనారాయణ, కరాటం కృష్ణ స్వరూప్, గుగ్గులోత్ మోహనరావు, కొవ్వాసు నారాయణ, మడకం జంపాలరావు, స్కూల్ కమిటీ చైర్మన్ కణితి దుర్గారావు, దొరమామిడి సర్పంచ్ తెల్లం రాముడు, గురుకులం సెక్రటరీ శ్రీకాంత్ ప్రభాకర్, ప్రిన్సిపాల్ వి రమేష్, ఆనంద్ ఏఈ, కాంట్రాక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T14:37:14+05:30 IST