బుట్టాయిగూడెంలో ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’

ABN , First Publish Date - 2022-09-08T21:44:38+05:30 IST

మండలంలోని అంతర్వేదిగూడెం సచివాలయం పరిధి ఇనుమూరు, కొరసవారి గూడెం గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో..

బుట్టాయిగూడెంలో ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’

బుట్టాయిగూడెం, (ఏలూరు): మండలంలోని అంతర్వేదిగూడెం సచివాలయం పరిధి ఇనుమూరు, కొరసవారి గూడెం గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా జగనన్న సుపరిపాలన చేరువైందని బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోడియం రామ తులసి, ఎంపీపీ కారం శాంతి రమణ, వైస్ ఎంపీపీలు కుక్కల వరలక్ష్మి, గుగ్గులోత్ మోహనరావు, సర్పంచ్ సత్యవరప్రసాద్, అల్లూరి రత్నాజి, అరేటి సత్యనారాయణ, కొవ్వాసు నారాయణ, పునేం కృష్ణ, కొరస వెంకట స్వామి, బొమ్మిరెడ్డి శ్రీనివాస్, పెంటమ్మ,  గోవిందరాజు, తరుణ్, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





Updated Date - 2022-09-08T21:44:38+05:30 IST