Abn logo
Sep 27 2021 @ 13:00PM

ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే...బంద్‌కు మద్దతు ఇవ్వాలి: సీతక్క

హైదరాబాద్: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని మోదీతో లోపాయకారి  ఒప్పందాలు చేసుకుందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. సోమవారం భారత్ బంద్ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు బాధపడితే ప్రభుత్వం బాగుపడదని.. సీఎం కేసీఆర్ అనేక మాయ మాటలు చెప్పారని విమర్శించారు. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర కేంద్రం చేస్తుంటే.. దాన్ని సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొంటే.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయి మంతనాలు చేస్తున్నారని, దీన్ని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి.. జరుగుతున్న బంద్‌కు మద్దతు ఇవ్వాలని, అలాగే నల్లచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీతక్క డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption