దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2020-09-25T10:57:37+05:30 IST

దివ్యాంగు ల సంక్షేమానికి ముఖ్య మంత్రి జగన్‌ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నా రు. స్థానిక కస్తూర్బా

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

బొబ్బిలి : దివ్యాంగు ల సంక్షేమానికి ముఖ్య మంత్రి జగన్‌ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నా రు. స్థానిక కస్తూర్బా పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో దివ్యాంగులకు స్వచ్ఛంద సంస్థలు మాత్రమే సహకారం అందిస్తుండేవని, ఇప్పుడు ప్రభుత్వం వారి ని ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ కల్పన, మండల ప్రత్యేకాధికారి,  తహసీల్దార్‌ పాత్రో, ఇన్‌చార్జి ఎంపీడీవో కృష్ణారావు, ఎంఈవో చల్లా లక్ష్మణరావు, ఏపీటీఎఫ్‌ నాయకుడు జేసీ రాజు, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ కోడి రాంబాబు  గురుకులంలో  నెలకొన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. 

Updated Date - 2020-09-25T10:57:37+05:30 IST