Abn logo
Oct 12 2021 @ 00:14AM

అధికారులు మండల అభివృద్ధికి పాటుపడాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క

ఎమ్మెల్యే సీతక్క 

కొత్తగూడ, అక్టోబరు 11 : అన్ని శాఖల అధికారులు కొత్తగూడ మండల అభివృద్ధి కోసం పాటుపడాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. కొత్తగూడ మండల కేంద్రంలో సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత కొన్ని నెలలుగా కరోనా విజృంభన  ఉన్నవేళ మండలంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అధికారులు గతంలో ఆగిన అభివృద్ధి పనులను మొదలు పెట్టి, పనులను వేగవంతం చేయాలని సూచించారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ, జడ్పీటీసీ పుష్పలత, అధికారులు పాల్గొన్నారు.