పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-07-16T01:11:09+05:30 IST

అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించి గౌరవించి పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే

పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి

మహబూబాబాద్: అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించి గౌరవించి పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.  జిల్లా కేంద్రంలో పోడు భూముల సమస్యపై అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క  పాల్గొని మాట్లాడారు. పోడు రైతులందరికీ పట్టాలు ఇచ్చి, రైతుబంధు వర్తింపచేయాలని కోరారు. పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్‌లు కొట్టడం, కందకాలు తవ్వడం, ఆక్రమించుకోవడం, దాడులను ఆపాలన్నారు. అసెంబ్లీలో, బయట, ఎన్నికల ముందు మహబూబాబాద్ బహిరంగ సభలో పోడు రైతులందరికీ పట్టాలిస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నారు.  


మడగూడెంలో రైతులను అధికారులు కొట్టడంతో వారు తిరగబడ్డారని సీతక్క పేర్కొన్నారు. మీడియా కూడా అధికారుల పక్షం ఉండకుండా, ప్రజల పక్షాన ఉండాలని హితవు పలికారు. కొత్త పోడు కొట్టేదీ లేదు, పాత పోడు ( భూముల ను)ను వదిలేదీ లేదని సీతక్క స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యపై త్వరలో ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పర్యటిస్తానని ఆమె తెలిపారు.

Updated Date - 2021-07-16T01:11:09+05:30 IST