ప్రశ్నించే గొంతులను అణచి వేస్తున్నారు: ఎమ్మెల్యే సీతక్క

ABN , First Publish Date - 2021-09-18T01:58:03+05:30 IST

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అణచి వేస్తున్నారని ప్రభుత్వంపై ఎమ్మెల్యే

ప్రశ్నించే గొంతులను అణచి వేస్తున్నారు: ఎమ్మెల్యే సీతక్క

సిద్దిపేట: రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అణచి వేస్తున్నారని ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. గజ్వేల్‌లో జరుగుతున్న దళిత, గిరిజన దండోరా సభలో సీతక్క మాట్లాడారు. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ అన్యాయం చేశారని సీతక్క ఆరోపించారు. చరిత్రలో లేని పార్టీలు కాంగ్రెస్ నేతలను తమవారిగా చెప్పుకుంటున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. మోదీ, అమిత్‌షా వేర్వేరు కానప్పుడు.. నెహ్రూ, సర్దార్‌ పటేల్ ఎలా వేర్వేరు అవుతారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో గిరిజన బంధు, మైనార్టీబంధు, బీసీబంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని సీతక్క డిమాండ్ చేసారు. 

Updated Date - 2021-09-18T01:58:03+05:30 IST