తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ దెబ్బకి విలవిలలాడి చంద్రబాబు కుప్పం బాట పెట్టారన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలైనా... ఏ ఎన్నికలైనా ప్రజలు జగన్ వైపే ఉన్నారన్నారు. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలన్నారు.. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చూపిస్తామని రోజా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి