Abn logo
May 29 2020 @ 02:58AM

ముహూర్తాలు పెట్టి అలిసిపోతున్నారు!

  • పార్టీ మార్పు వదంతులపై ఎమ్మెల్యే రామరాజు


ఉండి, మే 28: ‘నేను ఏప్రిల్‌ 8న వైసీపీలోకి మారుతున్నట్లు ముహూ ర్తం పెట్టారు. అది మారింది. తర్వాత ఏప్రిల్‌ 18 అన్నారు. అదీ మారింది. ఇప్పుడు మళ్లీ మరో ముహూర్తాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఈ విధం గా వైసీపీ వారు ముహూర్తాలు పెట్టి అలసిపోతున్నారు. ఏదైనా ఉంటే నేనే ముహూర్తం పెట్టుకుంటాను. వారెవరు పెట్టడానికి?’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను చేయబోయే మంచి కార్యక్రమాలకు ఎప్పుడు ముహుర్తాలు పెట్టుకోవాలో తనకు తెలుసుని ఆయన స్పష్టంచేశారు. ఉండిలో ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రామరాజు.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న  ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

Advertisement
Advertisement
Advertisement