Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలి: రాజసింగ్

హైదరాబాద్: బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ డిమాండ్ చేశారు. దీనిపై సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ షో ద్వారా ఆంధ్ర, తెలంగాణకు కొట్లాట పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బిగ్ బాస్ షోపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి, హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులతో కలసి షో చూడలేని పరిస్థితి ఉందన్నారు. సల్మాన్ ఖాన్ షోలో  హిందువుల మనోభావాలను కించపరిచారని, వ్యాపారం ముసుగులో ప్రాంతీయ అసమానతలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. కమీషన్లు తీసుకుని  అధికారులు షోలకు అనుమతి ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజసింగ్ విమర్శించారు.

Advertisement
Advertisement