ఘాట్‌ రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

ABN , First Publish Date - 2022-01-20T06:17:40+05:30 IST

బూదరాళ్ల ఘాట్‌ రోడ్డులో ఇటీవల జీపు బోల్తాపడి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వపరంగా తగిన సాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి హామీ ఇచ్చారు.

ఘాట్‌ రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
మంచంలో వున్న క్షతగాత్రురాలు చంటమ్మను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భాగ్యలక్ష్మి హామీ


కొయ్యూరు, జనవరి 19: బూదరాళ్ల ఘాట్‌ రోడ్డులో ఇటీవల జీపు బోల్తాపడి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వపరంగా తగిన సాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి హామీ ఇచ్చారు. బూదరాళ్ల-పెదవలస ఘాట్‌రోడ్డులో ఇటీవల జీపు బోల్తా పడిన ప్రమాదంలో కొయ్యూరు శివారు చింతవానిపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులు మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. మృతులు జర్తా దేముడు, చిట్టిబాబుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఈ నెల ఒకటో తేదీన ఆత్మహత్య చేసుకున్న బాలారం ఎంపీటీసీ సభ్యుడు రాంబాబు కుటుంబీకులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట వైస్‌ ఎంపీపీలు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలమ్మ, ఎంపీటీసీ సభ్యుడు మల్లికార్జున, కొప్పుల వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నాగమణి, తదితరులు వున్నారు. 


రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన  

జి.మాడుగుల: మండలంలో వంజరి-కొత్తూరుపాడు మధ్య రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి శంకుస్థాపన చేశారు. మారుమూల గ్రామాలకు రవాణా సదుపాయాన్ని మెరుగుపరచడానికి కల్పించడానికి రూ.3.76 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ మత్స్యరాస గాయత్రి, వైస్‌ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T06:17:40+05:30 IST