డాక్టర్ లేకపోవడంతో.. తానే సిజేరియన్ చేసిన ఎమ్మెల్యే!

ABN , First Publish Date - 2020-08-12T03:26:54+05:30 IST

సరైన సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో స్వయంగా తనే రంగంలోకి దిగారో ఎమ్మెల్యే. డెలివరీ సమయంలో ఇబ్బంది పడుతున్న ఓ మహిళకు స్వహస్తాలతో సిజేరియన్ చేశారు.

డాక్టర్ లేకపోవడంతో.. తానే సిజేరియన్ చేసిన ఎమ్మెల్యే!

ఐజ్వాల్: సరైన సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో స్వయంగా తనే రంగంలోకి దిగారో ఎమ్మెల్యే. డెలివరీ సమయంలో ఇబ్బంది పడుతున్న ఓ మహిళకు స్వహస్తాలతో సిజేరియన్ చేశారు. ఈ ఘటన మిజోరాం రాష్ట్రంలోని చాంఫాయిలో జరిగింది. ఈ జిల్లాలో ఇటీవల భూకంపం వచ్చింది. దీంతో బాధితులను పరామర్శించడానికి ఎమ్మెల్యే జీఆర్ థియామ్‌సంగా ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా డెలివరీ సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్న 38ఏళ్ల యువతిని ఆయన కలిశారు. సరైన సమయంలో వైద్యులు అందుబాటులో లేరని తెలుసుకున్న థియామ్‌సంగా.. తానే అత్యవసర సిజేరియన్ చేయడానికి పూనుకున్నారు. ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజకీయాల్లోకి రావడానికి ముందు థియామ్‌సంగా గైనకాలజీలో స్పెషలిస్ట్ వైద్యులు.

Updated Date - 2020-08-12T03:26:54+05:30 IST