నర్సంపేట, జనవరి 26 : నియోజకవర్గానికి గిరిజన గురుకుల పాఠశాల మంజూరైనట్టు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, సీఎం సహకారంతో పాఠశాల మంజూరైనట్లు తెలిపారు. ఆరేళ్లలో నియోజకవర్గానికి గిరిజన సైనిక్ గురుకుల పాఠశాల, అర్బన్ గురుకుల పాఠశాల, బీసీ బాలుర గురుకుల పాఠశాల, బీసీ బాలికల గురుకుల పాఠశాల, మైనారిటీ గురుకుల పాఠశాలలతో పాటు నూతనంగా గిరిజన గురుకుల పాఠశాలలు మంజూరైనట్లు విరించారు.