Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలందించారు: Payyavula

అనంతపురం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆంధ్రోద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్య ఐదు దశాబ్దాల పాటు ఎంతో  అనుభవాన్ని గడించారని తెలిపారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారని కొనియాడారు. సౌమ్యుడిగా, నిరాడంబరునిగా పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ చిత్తశుద్ధితో, ప్రజలకు సేవలందించిన రోశయ్య మృతి దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు పయ్యావుల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement
Advertisement