Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కమీషన్ల కోసమే ఎమ్మెల్యే

twitter-iconwatsapp-iconfb-icon
కమీషన్ల కోసమే ఎమ్మెల్యేకాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తను సన్మానిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

- కొడంగల్‌ అభివృద్ధ్దికి అడ్డుపడుతున్నదెవరు..? 

 - మా కార్యకర్తలపై  దాడులకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టం 

-  పార్టీ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

కోస్గి, జనవరి 25 : కమీషన్ల కోసమే ఇక్కడి ఎమ్మెల్యే పని చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవా రం కోస్గి మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నిర్దేశించిన స మయాని కంటే ముందే కొడంగల్‌ నియోజ కవర్గంలో కార్యకర్తలు 75 వేలకు పైగా సభ్యత్వాలను పూర్తి చేయడం అభినందనీయ మన్నారు. పార్టీ సభ్యత్వాలను పూర్తి చేసిన కొస్గి, మద్దూర్‌, బోంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌, కొడంగల్‌ నాయకులను, కార్యకర్తలను ఆయన  సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 1000 సభ్యత్వాలు పూర్తి చేసిన కా ర్యకర్తలకు రాహూల్‌గాంధీతో సన్మానం ఉంటుం దన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే కొడంగల్‌ మొదటి స్థానంలో నిలిందని, ఇది కార్య కర్తల అంకితభావానికి నిదర్శనమన్నారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని అ న్నారు.  సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరికి  రూ. 2లక్షల బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు పని చేస్తే 2024లో కాంగ్రెదే అధికారమన్నారు.  

కొడంగల్‌ ఎమ్మెల్యే అభివృద్ధి మరిచి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. కోస్గిలో బస్సు డిపో ఏర్పాటుకు తాను సొంత డబ్బులతో 4 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇస్తే నేటి వరకు డిపో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. నియోజక వర్గాన్ని దత్తత తీసుకున్న దరిద్రుడు ఎమయ్యాడని అన్నారు. కోస్గి మండలంలోని హకీంపేట, పోలేపల్లి గ్రామాలలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే చూస్తూ ఉరుకొబోమన్నారు. ఎడున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు, రైతులకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇవ్వని ముఖ్యమంత్రికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేద న్నారు.  కొడంగల్‌కు పట్టిన కొరివి దెయ్యాల ను పొలిమేరలు దాటేదాక తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించి న కొడంగల్‌ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, మీరు నాటిన మొక్క నేడు వృక్షమైందన్నారు.  అనం తరం బిజ్జారం సర్పంచ్‌ సంగీత, అమె భర్త రమేష్‌ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి అను చరులతో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రాంమ్మోహన్‌రెడ్డి, పార్టీ సమన్వయకర్త ముంగి జైపాల్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్‌ నాయకులు రఘు వర్ధన్‌రెడ్డి, నాగులపల్లి నరేందర్‌, ఇద్రిస్‌, తుడుం శ్రీనివాస్‌, గోవర్ధన్‌రెడ్డి, నాగులపల్లి శ్రీనివాస్‌, విద్యాసాగర్‌, జయకృష్ణ, యూసుఫ్‌, తిరుపతిరెడ్డి, బెజ్జురాము లు, నాగులపల్లి నర్సిములు, చెన్నారం మల్లేష్‌, రమేష్‌, హబిబ్‌, సాయన్నగౌడ్‌, సుమన్‌, పోలే పలల్లి నర్సింహ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. 

కమీషన్ల కోసమే ఎమ్మెల్యేకాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తను సన్మానిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.