ప్రజలను మోసం చేస్తున్న జగన్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-28T05:09:34+05:30 IST

సంక్షేమం, అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్‌ ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

ప్రజలను మోసం చేస్తున్న జగన్‌ ప్రభుత్వం
మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు


పాలకొల్లు అర్బన్‌, సెప్టెంబరు 27: సంక్షేమం, అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్‌ ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని 11వ వార్డులో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఓటరు నమోదు, పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రి య పరిశీలించారు. ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో వివిధ రకాల పన్నుల పేరుతో వెనక్కి తీసుకుంటోందన్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ చేయూత సొమ్ము ఇచ్చారని, విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో రేషన్‌కార్డులు రద్దు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గండేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి  పెచ్చెటి బాబు, బత్తుల మేరీ నిర్మల కుమారి, పసుపులేటి ప్రభుదాసు, వార్డు నాయకులు మహిళలు పాల్గొన్నారు. అనంతరం 2వ వార్డులో సామాజిక మరుగు దొడ్ల భవనంలో ఇబ్బందులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. గత నెలలో మోటారు రిపేరు చేయాలని కమిషనర్‌కు తెలియజేశారు. రిపేరు చేసిన 15రోజుల్లో పాడైపోవడంతో నీరులేక మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా మారిందని మహిళలు వాపోయారు. అధికారులు పట్టించుకోవాలి, లేకుం టే సొంత సొమ్ముతో శ్రమదానం చేసి మరుగుదొడ్లను బాగుచేస్తానని ఎమ్మెల్యే నిమ్మల అన్నారు. పట్టణంలో దేవి శరన్నవరాత్రుల పందిళ్ళను ఎమ్మెల్యే నిమ్మల సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దాం

నరసాపురం: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దామని ఇన్‌చార్జ్‌ పొత్తూరి రామరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. కొవ్వలి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ టీడీపీని గెలిపించేందుకు గ్రామస్థాయి నుంచి సమష్టి కృషి చేయాలన్నారు. కొప్పాడ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, కొల్లు పెద్దిరాజు, జక్కం శ్రీమ న్నారాయణ, కొల్లాటి బాలకృష్ణ, పాలూరి బాబ్జి, శిరిగినీడి రాజ్యలక్ష్మి తిరుమాని శశిరేక, గుబ్బల నాగరాజు, కత్తిమండ ముత్యాలరావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T05:09:34+05:30 IST