నెల్లూరు: వరద బాధితులపై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రెచ్చిపోయారు. పిచ్చి మందు తాగేసి మీ ఇష్టమొచ్చినట్టు రచ్చ చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క జిల్లా మంత్రి మన దగ్గరకి వస్తే డౌన్‌డౌన్ అంటారా అని ఆయన నిలదీశారు. బుద్ది ఉందా, సిగ్గుందా మీకు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రిని ఆ ప్రాంతం చూపిద్దామని తీసుకొస్తే అరిస్తే ఏమొస్తది, ఏం చేయగలుగుతారు అని నల్లపరెడ్డి ప్రశ్నించారు.