Abn logo
Apr 23 2021 @ 00:16AM

గోదావరి జలాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పూజలు

మెదక్‌/పాపన్నపేట, ఏప్రిల్‌ 22: ఉపనదిలోని నీళ్లు గోదావరిలో కలవడం చూశాము కానీ.. గోదావరి నీళ్లు ఉప నదుల్లో ప్రవహిస్తున్న చారిత్రక ఘట్టం తెలంగాణలోనే ఆవిష్కృతమైందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. చరిత్రను తిరగరాసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు. మంజీరాలో ప్రవహిస్తున్న గోదావరి జలాలకు ర్యాలమడుగు చెక్‌డ్యామ్‌ వద్ద మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పూజలు చేశారు. పసుపు కుంకుమ, పట్టుచీర సమర్పించారు. అనంతరం పాపన్నపేట మండలం గాంధారిపల్లి చెక్‌డ్యామ్‌ వద్ద గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశరావు చొరవతో కాలేశ్వరం నుంచి గోదావరి జలాలు మంజీరాలో ప్రవహిస్తున్నాయని కొనియాడారు. మండుటెండల్లో మంజీర నది గలగలపారుతుండడం అద్భుత దృశ్యమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత వైస్‌ చైర్‌పర్సన లావణ్యారెడ్డి, ఎంపీపీ యమున, ప్యాక్స్‌ చైర్మన హన్మంతరెడ్డి, పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంతరెడ్డి, వైస్‌ ఎంపీపీ విష్ణువర్దనరెడ్డి, సర్పంచలు వెంకట్‌రెడ్డి, జగన, అంజాగౌడ్‌, కిష్టయ్య, బిక్షపతి, మెదక్‌, పాపన్నపేట మండలాలకు చెందిన సర్పంచలు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. 

కూచనపల్లిలో ఎమ్మెల్సీ...

హవేళీఘణపూర్‌, ఏప్రిల్‌ 22: మండల పరిధిలోని కూచనపల్లి గ్రామ శివారులో మంజీరా నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ వద్ద మంజీర నదిలో ప్రవహిస్తున్న కాళేశ్వరం జలాలకు ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి గురువారం  పూజలు చేసి, జలహారతి ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మెదక్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన మల్లికార్జునగౌడ్‌, సర్పంచ దేవాగౌడ్‌, యామిరెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 

Advertisement