కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీకి చొరవ తీసుకోండి

ABN , First Publish Date - 2020-07-04T00:58:49+05:30 IST

కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీకి చొరవ తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుని ఉమ్మడి వర గల్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు కలిసారు.

కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీకి చొరవ తీసుకోండి

హైదరాబాద్‌: కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీకి చొరవ తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు కలిసారు. ఈసందర్భంగా వారు ఒక వినతి పత్రాన్నిఅందజేశారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, స్థానికసంస్థల ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, ఈ మేరకు కేటీఆర్‌ను శుక్రవారం ప్రగతి భవన్‌లో కలిశారు. ఈసందర్బంగా కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ వరంగల్‌ ప్రజల చిరకాల కోరిక అని తెలిపారు. దీని కోసం అనేక పోరాటాలు చేసినా మంజూరు ఇవ్వడం లేదన్నారు.


దీనికి అవసరమైన భూమిని కూడా సిద్దం చేశామని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కేటీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ వస్తే ఇక్కడి యువతకు ఉపాధి లభిస్తుందని, ఈ ప్రాంతానికి జాతీయ స్తాయిలో ప్రాధాన్యత ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా మంచిపేరు వస్తుందన్నారు. 

Updated Date - 2020-07-04T00:58:49+05:30 IST