నాకు ఎంత డబ్బు ఇచ్చాడో ప్రమాణం చేయాలి

ABN , First Publish Date - 2021-10-26T03:27:33+05:30 IST

తన ద్వారా పదవులు అనుభవించి తనపైనే విమర్శలు చేసిన వ్యక్తి ఎంపీపీ పదవి కట్టబెట్టినందుకు తనకు ఎంత డబ్బు ఇచ్చాడో అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

నాకు ఎంత డబ్బు ఇచ్చాడో ప్రమాణం చేయాలి
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

ఉదయగిరి రూరల్‌, అక్టోబరు 25: తన ద్వారా పదవులు అనుభవించి తనపైనే విమర్శలు చేసిన వ్యక్తి ఎంపీపీ పదవి కట్టబెట్టినందుకు తనకు ఎంత డబ్బు ఇచ్చాడో అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కొండాయపాళెం పంచాయతీ గానుగపెంటపల్లిలో సచివాలయం, ఆర్‌బీకే, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, అప్పసముద్రంలో సచివాలయం, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం అప్పసముద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పసముద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఎంపీపీతోపాటు మండల పార్టీ కన్వీనర్‌, సొసైటీ అధ్యక్షుడిగా చేస్తే ప్రెస్‌మీట్‌లు పెట్టి తనపైనే విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అవాకులు, చవాకులు పేలితే తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్లు అక్కి భాస్కర్‌రెడ్డి, వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు మూలె వినయ్‌రెడ్డి, జడ్పీ, మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యులు తాజుద్దీన్‌, సుభానీ, నాయకులు గానుగపెంట ఓబులరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, గోగుల వెంగళరెడ్డి, మూలె సుబ్బారెడ్డి, గౌస్‌మొహీద్దీన్‌, పీఆర్‌ డీఈ సుబ్బారెడ్డి, ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌, ఏఈ వాణి, తదితరులు పాల్గొన్నారు.   

 

Updated Date - 2021-10-26T03:27:33+05:30 IST