MLA కృష్ణారావు పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా

ABN , First Publish Date - 2021-11-25T17:06:34+05:30 IST

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి పోలీ్‌స

MLA కృష్ణారావు పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా

హైదరాబాద్/కూకట్‌పల్లి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం నియోజకవర్గ నాయకులు బుధవారం ఫిర్యాదు చేశారు. డబ్బు పంపాలంటూ మెసేజ్‌లు పంపుతున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్పందించొద్దని వారు కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింగ్‌రావు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు కిరణ్‌, పిడికిటి గోపాల్‌చౌదరి, హరిత, శాంత, సంతోష్‎రెడ్డి ఉన్నారు.  

Updated Date - 2021-11-25T17:06:34+05:30 IST