బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-08-04T06:32:29+05:30 IST

బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని

బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేకానంద్‌

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌

దుండిగల్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. దుండిగల్‌, కొంపల్లి మున్సిపాలిటీలు, నిజాంపేట్‌ కార్పొరేషన్‌ పరిఽధిలోని నాయీబ్రాహ్మణులు, రజకులకు సెలూన్లు, లాండ్రీలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఈ పథకంపై వారికి ఉన్న సందేహాలపై పేట్‌బషీరాబాద్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా బీసీ వెల్ఫేర్‌, ఎలక్ట్రిసిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని సెలూన్లు, లాండ్రీలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ పథకం వర్తింపునకు ఆన్‌లైన్‌ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి ఎంఎస్‌ ఝాన్సీరాణి, ఎలక్ట్రిసిటీ ఏడీఈలు రాజలింగం, లక్ష్మణ్‌, డీఈలు శ్రీనాఽథ్‌రెడ్డి, భిక్షపతి, యాద య్య, రేనయ్యనాయి, వెంకటేశ్వరనాయి, ఆంజనేయులు, కుమార్‌నాయి తదితరులు పాల్గొన్నారు.


విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కృషి

జీడిమెట్ల, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్‌ మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు కంగోజు బాలబ్రహ్మచారి ఆధ్వర్యంలో మహిళలు, యువకులు ఎమ్మెల్యే వివేకానంద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అన్నిరంగాల్లో వెనుకబడిన విశ్వకర్మలకు ప్రభుత్వ హక్కులను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్వి రాజుచారి, కోశాధికారి పి.రవీంద్రచారి, మహిళా అధ్యక్షురాలు సీహెచ్‌ భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షుడు కృష్ణచారి, పురుషోత్తంచారి, కృష్ణచారి, సలహాదారుడు ఉపేంద్రచారి, రమే్‌షచారి, పి.భాస్కర్‌చారి, జి.నరసింహాచారి, పి.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T06:32:29+05:30 IST