రూ.6 కోట్లతో కోటలో అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-01-23T05:12:09+05:30 IST

రూ.6 కోట్లతో కోటలో అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే

రూ.6 కోట్లతో కోటలో అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే
మధ్యకోటలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే, కమిషనర్‌, స్మితాకుమార్‌

 ఖిలావరంగల్‌, జనవరి 22: కోటకు కొత్తకళ రానుందని, రూ.6కోట్ల అభివృ ద్ధి పనులకు అనుమతి రావడంతో పర్యాటక ప్రాంత రూపురేఖలు మారను న్నాయని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. శనివా రం ఖిలావరంగల్‌ కోటను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా సూపరింటెం డెంట్‌ స్మితాకుమార్‌, నగర కమిషనర్‌ ప్రవీణ్యలతో కలిసి కోటను సందర్శిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో చారిత్రక ఖిలావరంగల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. గతంలో తాను మేయర్‌గా ఉన్నప్పుడు మొదలు పెట్టిన పనికి ఆర్కియాలజి కల్‌ సర్వేఆఫ్‌ ఇండియా డీజీ (డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌) నుంచి రూ.6.5 కోట్ల అభివృద్ధి పనులకు అనుమతి వచ్చిందన్నారు. ఈ నిధులతో శాశ్వత లైటింగ్‌ ఏర్పాట్లు చేస్తామన్నారు. కోటను టూరిజం హబ్‌గా మార్చడం కోసం ప్రణా ళికలు రూపొందించి, మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. 

ఆర్కియాలజీ సూపరింటెండెంట్‌ స్మితాకుమార్‌ మాట్లాడుతూ కోటలోని కట్టడాలు, నిర్మాణాలకు రూ.6కోట్లు మంజూరుకావడం ఆనందంగా ఉందని, వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా వారంతా మధ్యకోటలోని కీర్తితోరణాలు, శిల్పాల ఆవరణతో పాటు, ఏకశిలగుట్ట, రాతికోట, తదితర కట్టడాలను పరిశీలించారు. కార్యక్ర మంలో కేంద్ర పురావస్తుశాఖ సీఏ మల్లేశం, కుడా సిటీ ప్లానర్‌ అజిత్‌ రెడ్డి, 37,38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ-సురేష్‌, బైరబోయిన ఉమా- దామోదర్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:12:09+05:30 IST