సీఎం జగన్‌పై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-18T18:27:26+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్‌పై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్దాలు చెప్పుకుంటూ.. ప్రజలను మోసపుచ్చుకుంటూ బతకడం మంచిదికాదని’ వ్యాఖ్యానించారు. మనిషిగా పుట్టాక అంతో.. ఇంతో సహాయం చేయాలని, అలాంటి గుణం లేనప్పుడు ఎవరి పరిధిలో వారుండాలన్నారు... రాజకీయ లబ్ధికోసం ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారని కేతిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో తీవ్ర సంచలనంగా మారాయి. 


తాడిపత్రి నియోజక వర్గంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మహిళలకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రసంగించారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ.. సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమ్మెల్యే నోరుజారి ఈ వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డి వర్గీయులు చెబుతున్నప్పటికీ అధికారపార్టీలో మాత్రం ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - 2021-10-18T18:27:26+05:30 IST