సీజేఐ ఎన్వీ రమణకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-06-12T05:51:04+05:30 IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి తెలం గాణకు వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణకు శుక్రవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్వాగతం పలికారు.

సీజేఐ ఎన్వీ రమణకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సీజేఐకి స్వాగతం పలుకుతున్న జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌, జూన్‌ 11: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి తెలం గాణకు వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణకు శుక్రవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్వాగతం పలికారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో జీవన్‌రెడ్డి సీజేఐకి పుష్పగు చ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని సీజేఐకి పరిచయం చేశారు. 

Updated Date - 2021-06-12T05:51:04+05:30 IST