నిజామాబాద్: ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీనే రైతులు అరగంట ఆపారని, అలాంటిది రైతులకు అరవింద్ ఓ లెక్కా అని ఆయన వ్యాఖ్యానించారు. అరవింద్ అబద్దాల అడ్డా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టి, వారిని గుండాలు అంటు న్నారని ఆయన పేర్కొన్నారు. పసుపుబోర్డు తెస్తానని ఎంపీ బాండ్ రాసిచ్చారని, బోర్డ్ ఏమైందని రైతులు అడుగుతున్నారని ఆయన నిలదీశారు. అరవింద్ ఒళ్లు దగ్గరపెట్టు కో, రైతులకు క్షమాపణ చెప్పు అని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నువ్వెంత తెచ్చావో చర్చకు వచ్చే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీని అడ్డుకోవడం, అక్కడికి బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఇది దాడులు చేసుకునే వరకు వెళ్లింది.
ఇవి కూడా చదవండి