నిజామాబాద్: రైతులతో పెట్టుకున్నోడు, కేసీఆర్తో గోక్కున్నోడు ఎవరూ బాగుపడలేదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నగరంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలనలో రౌడీయిజం నడుస్తోందని, రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఒకమాట ఎన్నికలయినాక ఒకమాట బీజేపీది అని ఆయన విమర్శించారు. ఎంపీ బండి సంజయ్ ది నోరా, మోరా అని ఆయన ప్రశ్నించారు. నోటిఫికేషన్ వస్తే ముక్కు నేలకు రాస్తా అన్న బండి సంజయ్.. నేలకు ముక్కు రాయ్ అని ఆయన సవాల్ విసిరారు. ఎంపీ అరవింద్ ఓ ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ నాయకుడన్నారు. దేశమంతా ఒకే కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలన్నారు. దీన్ని అమలు చేయక పోతే బీజేపీ కార్యాలయాల్లో ధాన్యం పోస్తామని ఆయన హెచ్చిరించారు. అవసరమైతే గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమిస్తామని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి