MLA Jeevan reddy: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానస్పద వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2022-08-02T17:03:39+05:30 IST

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమాన స్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

MLA Jeevan reddy: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానస్పద వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ (Hyderabad): ఆర్నూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) ఇంటి వద్ద అనుమాన స్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్న భర్త.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగుతుండడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకుని, విచారిస్తున్నట్లు  పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-08-02T17:03:39+05:30 IST