Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 27 Jul 2022 10:52:43 IST

AP News: జనసేన వీర మహిళను జోడిచ్చుకు కొడతానంటూ రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

twitter-iconwatsapp-iconfb-icon
AP News: జనసేన వీర మహిళను జోడిచ్చుకు కొడతానంటూ రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

కాకినాడ (Kakinada): రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (MLA Jakkampudi Raja) తీరుపై జనసేన (Janasena) మహిళా కార్యకర్తలు తిరగబడ్డారు. అక్కడితో ఆగని ఎమ్మెల్యే ‘జోడిచ్చుకు కొడతా నీయమ్మా’ అంటూ మరింత రెచ్చిపోయారు. ఆడవాళ్లని కూడా చూడకుండా బూతులు తిట్టారు. ఎమ్మెల్యే జక్కంపూడిని అడ్డుకునేందుకు మహిళలు వచ్చారు. సీఎం జగన్‌ (CM Jagan)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే.. చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే నోటి దురుసు ప్రదర్శించారు. మహిళలను ఓయ్.. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దంటూ బెదిరింపులకు దిగారు.


పి.గన్నవరం మండలం జి.పెదపూడి ప్రధాన రహదారిపై జనసేన వీర మహిళలు ఉమ్మడి జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ చల్లా లక్ష్మి, రాష్ట్ర జనసేన కార్యదర్శి గంట స్వరూప, రాష్ట్ర జనసేన సహాయ కార్యదర్శి సౌజన్య, జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి ఎమ్మెల్యే రాజా కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు, జనసేన వీరమహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. సీఎం డౌన్‌ డౌన్‌ అంటు వీరమహిళల నినాదాలు చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రాజా పిచ్చిపిచ్చిగా ఉందా అంటు పరుష పదజాలాన్ని ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన మహిళలు రాజాపైకి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని  మహిళలను తోసివేశారు. దీంతో పోలీసులతో జనసేన వీర మహిళలు వాగ్వాదానికి దిగారు.  జక్కంపూడి కారుకు అడ్డంగా ఉన్న మహిళలను పక్కకు తప్పించి ఆ వాహనానికి రూట్‌ క్లియర్‌ చేసి జనసేన వీరమహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.