Pragati Bhavan ముట్టడికి Jaggareddy పిలుపు

ABN , First Publish Date - 2022-05-04T22:44:57+05:30 IST

రాహుల్ ఓయూ పర్యటనపై సందిగ్ధం కొనసాగుతోంది. ఎన్‌సీసీ గేట్, ఆర్ట్స్ కాలేజ్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Pragati Bhavan ముట్టడికి Jaggareddy పిలుపు

హైదరాబాద్‌: Pragati Bhavan ముట్టడికి Mla Jaggareddy  పిలుపునిచ్చారు. ఓయూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరణపై నిరసన తెలపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. గాంధీభవన్‌లో ఓయూ విద్యార్థి నేతలతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. కాసేపట్లో ప్రగతిభవన్ ముట్టడికి Jaggareddy ఓయూ నేతలు బయల్దేరనున్నారు. 


రాహుల్ ఓయూ పర్యటనపై సందిగ్ధం కొనసాగుతోంది. ఎన్‌సీసీ గేట్, ఆర్ట్స్ కాలేజ్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్ పర్యటనకు పాలక మండలి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. రంజాన్ సెలవుల కారణంగా రెండు రోజులుగా వీసీ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వీసీ వైఖరిపై తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓయులో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Read more