భట్టితో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

ABN , First Publish Date - 2022-02-24T21:08:14+05:30 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి

భట్టితో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. జగ్గారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారంతో ఇద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 25న శుక్రవారం  సంగారెడ్డిలో కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. దీంతో జగ్గారెడ్డిని భట్టి బుజ్జగిస్తున్నారు. 


కాంగ్రెస్‌ పార్టీకి త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి...కార్యకర్తలతో భేటీకి సిద్ధమయ్యారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, సీనియర్లు బుజ్జగింపుల అనంతరం పార్టీకి రాజీనామా చేసే అంశాన్ని జగ్గారెడ్డి 15 రోజులు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. 

   

Updated Date - 2022-02-24T21:08:14+05:30 IST