హోమంత్రి, డీజీపీ ఉన్నారా?...లేదా?: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-06-25T18:26:18+05:30 IST

రాష్ట్రంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హోమంత్రి, డీజీపీ ఉన్నారా?...లేదా?: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొంత మంది పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు.  పోస్టింగులు కోసం టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారన్నారు. అసలు హోమంత్రి, డీజీపీ ఉన్నారా లేదా అనేది తెలియడం లేదని...విచిత్ర పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. పోలీసులు కొన్ని చోట్ల కనీసం ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసులు కొందరు డ్రగ్స్.. గంజాయి లాంటి వాటిని కూడా వెనకేసుకు వస్తున్నారని అన్నారు. ‘‘కొందరు పోలీసులు...గుర్కా లెక్క పని చేయకండి...మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లాకప్ డెత్, అక్రమాలు చేస్తున్న పోలీసుల సంగతి చెప్తా... అందరి సంగతి తేలుస్తాం... అన్ని వివరాలు తీస్తాం’’ అంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-06-25T18:26:18+05:30 IST