Hyderabad: మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై జగ్గారెడ్డి Fire

ABN , First Publish Date - 2022-06-03T20:08:18+05:30 IST

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.

Hyderabad: మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై జగ్గారెడ్డి Fire

Hyderabad: మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy)పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం ప్రజల సమస్యలు చెప్పేందుకు అపాయింట్‌మెంట్ అడిగామని మంత్రి ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ (KCR) కూడా ఇవ్వడంలేదని విమర్శించారు. ఇక్కడ సరికొత్త పాలన నడుస్తోందన్నారు. టెట్ (Tet) నోటిఫికేషన్ నెల రోజుల క్రితం వచ్చిందని ఆర్ఆర్‌బీ (RRB) నోటిఫికేషన్ ఏడాది క్రితం వచ్చిందన్నారు. టెట్, ఆర్ఆర్‌బీ రెండు పరీక్షలు రాసే వాళ్ళు  మూడు లక్షల మంది ఉన్నారన్నారు. ఆర్ఆర్‌బీ పరీక్ష రోజే టెట్ పెడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్ధులు రెండో పరీక్షకు హాజరు కాలేకపోతున్నారని అన్నారు.


టెట్ తేదీ మార్చడానికి ఇబ్బంది ఏంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి సబితా కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదన్నారు. మంత్రి మనసు కరిగి.. టెట్ వాయిదా పడాలన్నారు. సబితా ఇంద్రారెడ్డి వచ్చే వరకు ఇంటి ముందు ధర్నా చేస్తామని ప్రకటించిన జగ్గారెడ్డి... మంత్రి ఇంటి ముందు ఎన్ఎస్‌యూఐ nsui కార్యకర్తలుతో కలిసి  కూర్చున్నారు.

Updated Date - 2022-06-03T20:08:18+05:30 IST