Abn logo
Aug 8 2021 @ 16:09PM

తప్పుడు ప్రచారాలు చేయొద్దు : జగ్గారెడ్డి

హైదరాబా‌‌ద్: తనపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని మనవి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వారం రోజుల నుంచి తనకు జ్వరంగా ఉందని.. అందుకే కోర్టుకు కూడా హాజరుకాలేదన్నారు. దీంతో తనకు కోర్టు నుంచి వారెంట్ కూడా వచ్చిందని, ఇది అందరికీ తెలిసిందే అని చెప్పారు. ఈ కారణంగానే సోమవారం జరగనున్న ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. సభకు హాజరుకాలేదని ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని విన్నవించారు. సమన్వయకర్తగా సభ ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు చర్చించానని వివరించారు. అలాగే ఎమ్మెల్యే సీతక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురు డీసీసీ ప్రెసిడెంట్లతో సభకు సంబంధించిన అంశాలపై మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు.