Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ అసెంబ్లీ ఘటనను ఎవరైనా ఖండించాల్సిందే: జగ్గారెడ్డి

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను ఖండించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైసీపీనాయకులు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు. వైసీపీ నాయకులు ఇలాగే చేస్తే జగన్ కే ఒకరోజు రివర్స్ అవుతుందని అన్నారు. సీఎం పదవి జగన్ కు శాశ్వతం కాదు.రాజకీయాలు హుందాగా ఉండాలి.చంద్రబాబు కు జరిగిన అవమానాన్ని ఒక ఎమ్మెల్యేగా జగ్గారెడ్డిగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరం కలిసి పనిచేసాం.వైఎస్ ఒకానొక సమయంలో బాబు విషయంలో మాట జారినప్పుడు విచారం వ్యక్తం చేశారు.ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు.


శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జగన్ సమక్షంలో కొందరు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తిగత దూషణలు నేను చూడలేదు. బాబు ఏడవడం చూస్తే ఎథిక్స్ ఉన్నవాళ్లకు బాధ అనిపించింది.దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత చంద్ర బాబు అని, ఆయన వయసు రీత్యాగా అయినా మాజీ సీఎం గా నైనా గౌరవించాలి. వ్యక్తిగత దూషణలు మంచిది కాదు.బాబు భార్య విషయంలో చాలా తప్పుగా మాట్లాడారు.నాని, రోజా మాట్లాడిన విధానం తప్పు..ప్రజలు దాన్ని ఆమోదించరు.ఆయన ఫ్యామిలీ ని దూషించినందుకు తట్టుకోలేక బాబు ఏడ్చారు. ఎంత పెద్ద నాయకులైనా కుటుంబంతో అనుబంధం ఉన్న నేతలు తట్టుకోలేరు.బాబు భార్యను దూషించిన మాటలే జగన్, నాని, రోజాను అంటే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.


చంద్రబాబు కుటుంబాన్ని దూషిస్తుంటే చూసిన స్పీకర్ తమ్మినేని ఆ పదవికి అనర్హుడని జగ్గారెడ్డి అన్నారు. బాధ్యతల్లో ఉన్న నాని, అనిల్ వంటి మంత్రులు దంగల్ లో దిగినట్లు ప్రవర్తిస్తున్నారని, చంద్రబాబు ను తిడుతున్న వారికి ఫామిలీలు లేవు.ఇలాంటి సంప్రదాయాలకు జగన్ ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు.నాకు ఏపీ రాజకీయాలతో ఏం సంబంధం అని అడుగొచ్చు.నాక్కూడా ఏపీతో అనుబంధం ఉంది. భారతంలో కౌరవులు చేసినట్లు ఏపీ అసెంబ్లీ లో వైసీపి నేతలు ప్రవర్తిస్తున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement