Advertisement
Advertisement
Abn logo
Advertisement

కబ్జా రుజువైతే.. ముక్కు నేలకు రాస్తా

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 6 : తాను భూములను కబ్జా చేశానని ఆరోపించడం మతిలేని చర్య అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఎకరా భూమి కబ్జా చేసినట్లు రుజువైనా ముక్కు నేలకు రాస్తానని, తన భార్య చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలో నిర్వహించిన బీజేపీ రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. మంత్రి స్థాయిలో తానే.. బెదిరించి అసైన్డ్‌ భూములు తీసుకుంటే, మరి సీఎం స్థాయిలో కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఎన్ని వేల ఎకరాలు తీసుకుని ఉంటాడో చెప్పాలన్నారు.

Advertisement
Advertisement