Abn logo
Apr 13 2021 @ 00:11AM

యూజీడీ పనులపై ఎమ్మెల్యే అసహనం

క్షేత్రస్థాయిలో పరిశీలించిన అదీప్‌రాజ్‌ 

సిబ్బంది నిర్వాకంతో రెండు వార్డులు కోల్పోయామని ఆగ్రహం

సిబ్బంది టూ వీలర్‌పై తిరగాలని ఆదేశం 

పెందుర్తి,  ఏప్రిల్‌  12: భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) అస్తవ్యస్త పనులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, అవి తెలియాలంటే సిబ్బంది ద్విచక్ర వాహనాలపై వీధుల్లో తిరగాలని ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ అన్నారు. పనులు నత్తనడకన సాగుతుండడంతో సోమవారం ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. అనంతరం సుజాతనగర్‌ కమ్యూనిటీ భవనంలో గ్రేటర్‌ 95, 96 ,97, 98 వార్డుల్లో చేపట్టిన యూజీడీ పనుల ప్రగతిపై అఽధికారులు, సిబ్బందితో అత్యవసర సమీక్ష నిర్వహించారు. గడువు ముగుస్తున్నా పనులు పూర్తికాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపడుతుండడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. మీ నిర్వాకంతో జీవీఎంసీ ఎన్నికల్లో రెండు వార్డులు కోల్పోయామన్నారు. ఈ సందర్భంగా యూజీడీ పనుల నిర్వహణపై సిబ్బంది మ్యాపు చూపించడంతో, పనుల సంగతి తేల్చండని నిలదీశారు. సుజాతనగర్‌, గోపాలకృష్ణనగర్‌లో ఎమ్మెల్యే పర్యటించారు. యూజీడీ కనెక్షన్లు ఎన్ని ఇళ్లకి ఇచ్చారో ఆరా తీశారు. రహదారులపై గోతుల పరిస్థితిని ప్రశ్నించారు. ఆయన వెంట కార్పొరేటర్‌ ముమ్మన దేవుడు, యూజీడీ ఈఈ వెంకటరావు,మెంటి మహేష్‌, ఎల్‌బీ నాయుడు, గొర్లె రామునాయుడు, కోరాడ చందుయాదవ్‌, చిప్పల చందు, జోబుదాసు(చిన్ని) మల్లువలస సన్నిబాబు, వెంకటపతిరాజు  ఉన్నారు. 


Advertisement
Advertisement
Advertisement