ఎమ్మెల్యే హాస్టల్‌లో బాంబు పెట్టారంటూ ఫోన్.. ఖాళీ చేయించిన పోలీసులు..

ABN , First Publish Date - 2020-09-29T19:02:25+05:30 IST

దక్షిణ ముంబైలోని ఓ ఎమ్మెల్యే హాస్టల్‌లో బాంబు పెట్టారంటూ పోలీసులకు ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన ...

ఎమ్మెల్యే హాస్టల్‌లో బాంబు పెట్టారంటూ ఫోన్.. ఖాళీ చేయించిన పోలీసులు..

ముంబై: దక్షిణ ముంబైలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో బాంబు పెట్టారంటూ పోలీసులకు ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన అందులో నుంచి అందర్నీ ఖాళీ చేయించారు. అయితే తనిఖీ తర్వాత హాస్టల్ ఆవరణలో ఎటువంటి బాంబు లేదనీ... ఆ ఫోన్‌కాల్ నకిలీదని తేలడంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని ఓ  వ్యక్తిని నుంచి నగర పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర సచివాలయం సమీపంలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్‌లో బాంబు పెట్టారని అవతలి వ్యక్తి చెప్పినట్టు సమాచారం. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని, హాస్టల్‌లో ఉన్న దాదాపు 150 మందిని ఖాళీచేయించారు. ఇవాళ తెల్లవారు జామున బాంబ్ డిస్పోజల్ అండ్ డిటెక్టివ్ స్క్వాడ్ (బీడీడీఎస్)‌తో పాటు, పోలీసు జాగిలాలతో తనిఖీ నిర్వహించారు. అయితే హాస్టల్లో అనుమానాస్పద వస్తువులేవీ లేవనీ.. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని బీడీడీఎస్, పోలీసులు తేల్చారు. 

Updated Date - 2020-09-29T19:02:25+05:30 IST