Nizamsagar: నాలుగు గేట్లు ఎత్తివేసిన ఎమ్మెల్యే హనుమంతు షిండే

ABN , First Publish Date - 2022-07-23T19:28:36+05:30 IST

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే హనుమంతు షిండే ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Nizamsagar: నాలుగు గేట్లు ఎత్తివేసిన ఎమ్మెల్యే హనుమంతు షిండే

కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌(Nizam sagar project)కు వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే హనుమంతు షిండే (Hanumantu Shinde) ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని  దిగువకు విడుదల చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 36400 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో  24000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1403.25 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.323 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-23T19:28:36+05:30 IST