Advertisement
Advertisement
Abn logo
Advertisement

జనసేనపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్

పశ్చిమగోదావరి:  జనసేన అధినేత పవన్ కల్యాణ్, జన సైనికులపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. జనసేన నాయకుడుకు పిచ్చి పరాకాష్టకు చేరినట్లే జన సైనికులకు అదే పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్రో ధరలు పెరిగాయని ప్రకాశం జిల్లాలో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్న బస్సుకు నిప్పు పెట్టిన వ్యక్తి జనసైనికుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు జనసేనకు ఓటు వేయలేదని జనాన్ని చంపేస్తారేమోనని అన్నారు. షూటింగ్ అయిపోగానే రెండు నెలలకు ఒకసారి వచ్చి రెండు మీటింగులు పెట్టి యుద్ధం చేద్దామంటాడని విమర్శించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement