కరోనా మృతుల అంత్యక్రియలకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు

ABN , First Publish Date - 2021-05-14T05:47:30+05:30 IST

కరోనాతో మృతి చెందిన వారి అంత్య క్రియలకు పట్టణంలోని శ్మశాన వాటికలలో ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

కరోనా మృతుల అంత్యక్రియలకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు
శ్మశాన వాటికలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నరసరావుపేట, మే 13 : కరోనాతో మృతి చెందిన వారి అంత్య క్రియలకు పట్టణంలోని శ్మశాన వాటికలలో ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని హిందూ, క్రైస్తవ, ముస్లిం శ్మశాన వాటికలను ఆయన గురువారం సందర్శించారు. అంత్యక్రియలకు ఎవరైనా డబ్బు వసూలు చేసినట్టు తెలిస్తే వారి పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందని గోపి రెడ్డి హెచ్చరించారు. కరోనా అంటురోగమే కానీ వ్యక్తి మరణించిన 3 గంటల తర్వాత కరోనా వైరస్‌ చనిపోతుందని తెలిపారు. శ్మశాన వాటికలలో అంత్యక్రియల పర్యవేక్షణకు నోడల్‌ అధికారులను నియమించామన్నారు. కరోనా కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించి కరోనా మృతులను గౌరవిద్దామని చెప్పారు. ఈ విషయంలో మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరు భావించాలని గోపిరెడ్డి కోరారు. కార్యక్రమంలో కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి డీఈ శ్రీనివాసరావు సీఐ కృష్ణయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-14T05:47:30+05:30 IST