ప్రశంసించిన నోటితోనే విమర్శలా..?

ABN , First Publish Date - 2022-08-20T05:42:08+05:30 IST

ప్రశంసించిన నోటితోనే విమర్శలా..?

ప్రశంసించిన నోటితోనే విమర్శలా..?

రాష్ట్ర ప్రభుత్వం పనితీరును అప్పట్లో మెచ్చుకున్న కేంద్రం

అధికార దాహంతో ఇప్పుడు బీజేపీ నేతల ఆరోపణలు

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

రేగొండ, ఆగస్టు 19: ఒకప్పుడు ప్రశంసించిన నోటితోనే బీజేపీ నేతలు మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమని ఎమ్మెల్యే గండ్ర వెంకటర మణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు అప్పట్లో మెచ్చుకున్నారని గుర్తు చేశారు. మండలంలోని సుల్తాన్‌పూర్‌, గోరికొత్తపల్లి, చిన్నకో డెపాక, రేగొండ, కొత్తపల్లి-బీ గ్రామాల్లో ఎమ్మెల్యే శుక్రవారం పర్యటించారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పనితీరు బాగుందని ఒకప్పుడు మెచ్చుకున్న బీజేపీ నేతలు అదే నోటితో నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రా న్ని కేసీఆర్‌ ప్రశ్నిస్తుండటంతో వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిం చారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు అవాకులు చెవాకులు పలుకుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వ రం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేని అసమర్థ బీజేపీ నాయకులు దీని నిర్మాణం లో అవినీతి జరిగిందనడం అవివేకమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగా ణను అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప మానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని కొనియాడారు. రెండు సీట్లు గెలవగానే బీజేపీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు హింగె మహేందర్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మటిక సంతోష్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు ఉమేష్‌గౌడ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పాపిరెడ్డి, సర్పంచులు పాతుపల్లి సంతోష్‌, చిగురుమామిడి రజిత, లంగంపల్లి శ్వేత, దండబోయిన సంతోష్‌, బుచ్చమ్మ,  ఐలయ్య, ఎంపీటీసీలు సుమలత, ప్రతాపరెడ్డి, ఐలి శ్రీధర్‌, బొట్ల కవిత, సందెల స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:42:08+05:30 IST