టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే..

ABN , First Publish Date - 2022-08-08T05:39:15+05:30 IST

టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే..

టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే..

భ్రమలకు తావు లేదు..

 సీఎం ఆశీస్సులతో గులాబీ జెండా ఎగురవేస్తాం 

 భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

కృష్ణకాలనీ, ఆగస్టు 7: రాబోయే ఎన్నికల్లో భూపాలపల్లి టీఆర్‌ఎస్‌ టికెట్‌ తనకేనని, తానే పోటీ చేసి విజయం సాధించి తీరుతానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లిలోని క్యాంపు కార్యా లయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎలాంటి భ్రమలకు తావు లేదని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. తన గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టు బడి ఉంటూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా చేప డుతున్నానని అన్నారు. భూపాల పల్లిలో మెడికల్‌ కళాశాలకు పరిపాలనా అనుమతులు వచ్చాయని, రూ. 168 కోట్ల నిఽధులు కూడా సీఎం కేసీఆర్‌ కేటాయించారని తెలిపారు. ఇప్పటికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, ఆయుష్‌ ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యిందన్నారు. వీటితో పాటు 100 పడకల ఆస్పత్రిలో శాశ్వత ఉద్యోగ నియామకాలకు కూడా మంత్రి హరీశ్‌రావు 71 పోస్టులకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. త్వరలోనే రూ. 80 కోట్ల వ్యయం తో చెల్పూర్‌ నుంచి బాంబులగడ్డ వరకు రోడ్డు విస్త రణ, డ్రెయినేజీల నిర్మాణం జరుగుతాయన్నారు.  రూ. 15 కోట్లతో అన్ని సౌకర్యాలతో డిగ్రీ కళాశాల భవనం కూడా నిర్మించామని వివరించారు. ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లకు శ్రీకారం చుట్టనుండగా నియోజకవర్గంలో సుమారు 10 వేల మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. లోక కల్యాణార్థం చేపట్టిన ఆలయ నిర్మాణంలో భూ కబ్జా జరిగిందని కొందరు అంటున్నారని, ఇలా ఆరోపణలు చేయడం సిగ్గు చేటని అన్నారు. ఆలయ నిర్మాణానికి ముందుగా తన కుటుంబ సభ్యుల తరఫున రూ. 40 లక్షలు విరాళంగా అందించామని స్పష్టం చేశారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు  కావాలని కోరారు.  ప్రజా సేవే ధ్యేయంగా తనతో పాటు తన సతీమణి గండ్ర జ్యోతి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. జీఎంఆర్‌ఎం ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ హరిబాబు, జంగేడు పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌ యాదవ్‌, కౌన్సిలర్లు శిరుప అనిల్‌, ముంజాల రవీందర్‌, బద్ది సమ్మయ్య, నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, మాడ హరీశ్‌రెడ్డి, కురిమిళ్ల శ్రీనివాస్‌, కరీం తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2022-08-08T05:39:15+05:30 IST